అప్రమత్తంగా ఉండాలి

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రజలు కూడా ఇండ్లలోనే ఉండాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్‌లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాల్లో […]

Update: 2020-10-18 06:51 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రజలు కూడా ఇండ్లలోనే ఉండాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్‌లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News