వ్యవసాయంలో మనం ఆదర్శం: మంత్రి సింగిరెడ్డి

దిశ, మహబూబ్‎నగర్: వ్యవసాయ విధానాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ నేపథ్యంలోనే రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతువేదికలతో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమని సింగిరెడ్డి ఆకాంక్షించారు. నియంత్రిత పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. డిమాండ్ లేని పంట సాగుతో రైతులు […]

Update: 2020-06-19 09:29 GMT

దిశ, మహబూబ్‎నగర్: వ్యవసాయ విధానాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ నేపథ్యంలోనే రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతువేదికలతో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమని సింగిరెడ్డి ఆకాంక్షించారు. నియంత్రిత పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. డిమాండ్ లేని పంట సాగుతో రైతులు నష్టాల పాలవుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ నియంత్రిత పంటల సాగుకు పిలుపు నిచ్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News