ఓఆర్ఆర్‌లో ట్రామా కేంద్రాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని స్టేట్ హైవేల వెంట లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసెస్, ట్రామా సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శనివారం ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఇంటర్ ఛేంజ్ వద్ద హెచ్ఎండీఎ, హెచ్ జీసీఎల్‌లు ఏర్పాటుచేసిన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసెస్, ట్రామా సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డు వెంట అత్యవసర సేవలను […]

Update: 2020-10-17 06:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని స్టేట్ హైవేల వెంట లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసెస్, ట్రామా సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శనివారం ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఇంటర్ ఛేంజ్ వద్ద హెచ్ఎండీఎ, హెచ్ జీసీఎల్‌లు ఏర్పాటుచేసిన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసెస్, ట్రామా సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డు వెంట అత్యవసర సేవలను అందించేందుకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Tags:    

Similar News