రాష్ట్ర సరిహద్దుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో మెదక్ జిల్లా సరిహద్దు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. శనివారం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన వికారాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని చందానగర్, మహారాష్ట్ర, కర్ణాటకలతో సరిహద్దు ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్‌ల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల్లో కొత్తవారు ఎవరూ రాకుండా చూడాలని సర్పంచులు, ప్రజలకు సూచించారు. ఈ దారుల గుండా […]

Update: 2020-04-18 09:29 GMT

దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో మెదక్ జిల్లా సరిహద్దు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. శనివారం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన వికారాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని చందానగర్, మహారాష్ట్ర, కర్ణాటకలతో సరిహద్దు ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్‌ల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల్లో కొత్తవారు ఎవరూ రాకుండా చూడాలని సర్పంచులు, ప్రజలకు సూచించారు. ఈ దారుల గుండా రాకపోకలు నిలిపివేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. అనుమానితులు ఎవరూ కనిపించినా సమాచారం అందించాలని, బయట నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేశాకే అనుమతించాలని వైద్యఆరోగ్య శాఖ అధికారికి ఆదేశించారు. మెడికల్ షాపుల యజమానులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయాని హెచ్చరించారు. ఎవరైనా దగ్గు, జ్వరం, ఆయాసంతో వస్తే డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం ఇవ్వాలని ప్రైవేటు వైద్యులకు సూచించారు.

Tags: medak collecter hanumantha rao, visit state borders, suggestion to border people

Tags:    

Similar News