నలుగురిని రక్షించిన ఎండీఆర్ ఫౌండేషన్

దిశ, పటాన్‌చెరు: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పటాన్‌చెరు మండల పరిధిలోని పోచారం వద్ద ఉన్న నక్కవాగు ఉప్పొంగి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో మంగళవారం రాత్రి 12:30 గం.ల సమయంలో రెండు కార్లలో నలుగురు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు. కాగా పటాన్‌చెరు పోలీసుల ద్వారా ఎండీఆర్ ఫౌండేషన్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రిథ్వీరాజ్, మధు, రాకేశ్, ప్రణీత్, జాన్, రమేశ్‌లు ఘటన స్థలానికి […]

Update: 2020-10-14 10:09 GMT

దిశ, పటాన్‌చెరు: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పటాన్‌చెరు మండల పరిధిలోని పోచారం వద్ద ఉన్న నక్కవాగు ఉప్పొంగి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో మంగళవారం రాత్రి 12:30 గం.ల సమయంలో రెండు కార్లలో నలుగురు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు.

కాగా పటాన్‌చెరు పోలీసుల ద్వారా ఎండీఆర్ ఫౌండేషన్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రిథ్వీరాజ్, మధు, రాకేశ్, ప్రణీత్, జాన్, రమేశ్‌లు ఘటన స్థలానికి చేరుకున్నారు. తాడు సహాయంతో నలుగురిని సురక్షితంగా వరద నీటిలోంచి బయటకు తీసుకువచ్చారు. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అక్కడకు వచ్చి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:    

Similar News