ఫంక్షన్‌ హాల్‌లో పెళ్ళికి మాత్రమే అనుమతి

దిశ, వరంగల్: కేవలం పెళ్ళిళ్లు చేసుకునేందుకు మాత్రమే ఫంక్షన్ హల్స్ అద్దెకు ఇవ్వాలని వరంగల్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫంక్షన్ హాల్స్ యాజమాన్యం ఇకపై కేవలం పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి మాత్రమే ఫంక్షన్‌హాల్‌ను అద్దెకు నిబంధనలు జారీ చేశారు. మరెఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వరాదన్నారు. అదే విధంగా పెళ్ళిళ్ళు జరుపుకునే సమయంలో అమ్మాయి, అబ్బాయి తరుపున కేవలం 50మంది […]

Update: 2020-07-06 09:31 GMT

దిశ, వరంగల్: కేవలం పెళ్ళిళ్లు చేసుకునేందుకు మాత్రమే ఫంక్షన్ హల్స్ అద్దెకు ఇవ్వాలని వరంగల్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫంక్షన్ హాల్స్ యాజమాన్యం ఇకపై కేవలం పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి మాత్రమే ఫంక్షన్‌హాల్‌ను అద్దెకు నిబంధనలు జారీ చేశారు. మరెఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వరాదన్నారు. అదే విధంగా పెళ్ళిళ్ళు జరుపుకునే సమయంలో అమ్మాయి, అబ్బాయి తరుపున కేవలం 50మంది అతిథులు మాత్రమే హజరయ్యే విధంగా ఫంక్షన్ హల్ యాజమాన్యం పర్యవేక్షించాలన్నారు. ఎవరైనా పోలీస్ ఉత్తర్వులు అతిక్రమించి ఇతర కార్యక్రమాలకు ఫంక్షన్ హాల్స్‌ను అద్దెకు ఇస్తే సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Tags:    

Similar News