100 బిలియన్ల క్లబ్ లో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 

దిశ, వెబ్ డెస్క్: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 100 బిలియనీర్ల (సెంటి బిలియనీర్) క్లబ్ లో సభ్యులయ్యారు. ఇప్పటికే అమెజాన్ వ్యవస్థాపకుడు (amazon founder) జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (microsoft co-founder) ఈ క్లబ్ లో ఉండగా… మూడో వ్యక్తి జుకర్ బర్గ్ ఇందులో స్థానం సంపాదించారు. ఆంగ్ల మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ (bloomberg) కథనం ప్రకారం ఆగష్టు 7న జుకర్ బర్గ్ నికర విలువ 102 బిలియన్ […]

Update: 2020-08-08 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 100 బిలియనీర్ల (సెంటి బిలియనీర్) క్లబ్ లో సభ్యులయ్యారు. ఇప్పటికే అమెజాన్ వ్యవస్థాపకుడు (amazon founder) జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (microsoft co-founder) ఈ క్లబ్ లో ఉండగా… మూడో వ్యక్తి జుకర్ బర్గ్ ఇందులో స్థానం సంపాదించారు.

ఆంగ్ల మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ (bloomberg) కథనం ప్రకారం ఆగష్టు 7న జుకర్ బర్గ్ నికర విలువ 102 బిలియన్ డాలర్లు. ఆగష్టు 5న 50 దేశాల్లో టిక్ టాక్ లాంటి యాప్ ఫేస్బుక్ (facebook) యాజమాన్యంలోని ఇంస్టాగ్రామ్ రీల్స్ ని అధికారికంగా విడుదల చేసింది. దీంతో ఫేస్బుక్ షేర్లు 6 శాతం పెరిగి స్టాక్ విజృంభణ కారణంగా జుకర్ బర్గ్ నికర విలువ 100 బిలియన్లు దాటింది.

Tags:    

Similar News