నేను కేటీఆర్ పీఏను.. రూ.50 లక్షలు పంపించండి

దిశ, వెబ్‌డెస్క్ : జల్సాలకు అలవాటు పడిన యువకుడు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని కంత్రీ ప్లాన్ వేశాడు. చిన్నాచితక వాళ్లయితే లాభం లేదనుకుని ఏకంగా మంత్రి కేటీఆర్ పేరునే వాడుకున్నాడు. ప్లాన్ పక్కాగా వేసినా అవతలి వాళ్ల అప్రమత్తతతో అడ్డంగా బుక్ అయ్యాడు. బంజారాహిల్స్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌. గత కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ జల్సాలకు […]

Update: 2021-02-22 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జల్సాలకు అలవాటు పడిన యువకుడు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని కంత్రీ ప్లాన్ వేశాడు. చిన్నాచితక వాళ్లయితే లాభం లేదనుకుని ఏకంగా మంత్రి కేటీఆర్ పేరునే వాడుకున్నాడు. ప్లాన్ పక్కాగా వేసినా అవతలి వాళ్ల అప్రమత్తతతో అడ్డంగా బుక్ అయ్యాడు. బంజారాహిల్స్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌. గత కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటుపడ్డాడు. కష్టపడడానికి ఇష్టపడని నాగరాజు.. తేలికగా డబ్బులు సంపాదించేందుకు రాంగ్ రూట్లను ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ పీఏ అవతారం ఎత్తాడు. ఈనెల 15న బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో పిల్లల ఆస్పత్రి ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఎండీ డాక్టర్‌ కంచర్ల రమేశ్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. తరువాత ఆయనకు ఫోన్‌ చేసి తాను కేటీఆర్‌ పీఏ తిరుపతిరెడ్డిని అని పరిచయం చేసుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 25న కేటీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. మీడియాలో ప్రకటనలిచ్చేందుకుగాను రూ.50 లక్షలు సమకూర్చాలని కోరాడు.
అయితే అనుమానం వచ్చిన డాక్టర్‌ రమేశ్‌ ఆరా తీయగా ఆ నంబర్‌ తిరుపతిరెడ్డిది కాదని తేలింది.

వెంటనే ఆస్పత్రి సీనియర్‌ మేనేజర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు గతంలో కూడా ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా తేలింది. జూబ్లీహిల్స్, ఓయూ, సైబర్‌ క్రైం పోలీసులు గతంలోనూ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News