‘రైతన్న’సినిమాను విజయవంతం చేయండి

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతన్న మూవీ శనివారం విడుదలైంది. విజయవాడలోని కళ్యాణచక్రవర్తి థియేటర్‌లో ఉదయం 11 గంటలకు మూవీ విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ గురించి వడ్డే శోభనాదీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల వలన రైతాంగానికి జరుగుతున్న నష్టం, స్వామినాథన్ కమిషన్ […]

Update: 2021-08-14 05:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాదీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతన్న మూవీ శనివారం విడుదలైంది. విజయవాడలోని కళ్యాణచక్రవర్తి థియేటర్‌లో ఉదయం 11 గంటలకు మూవీ విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ గురించి వడ్డే శోభనాదీశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

మూడు నల్ల వ్యవసాయ చట్టాల వలన రైతాంగానికి జరుగుతున్న నష్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు, కనీస మద్దతు ధర ఆవశ్యకత, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆవశ్యకత, రైతులు ముఖ్యంగా కౌలు రైతుల కష్టాలు, నష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారన్నారు. ఢిల్లీలో 8 మాసాలుగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ సినిమా తీశారని తెలిపారు. ఈ సినిమాను తిలకించి ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు తెలపాలని వడ్డే కోరారు.

Tags:    

Similar News