అమ్మాయిలు చాన్స్ ఇస్తేనే.. అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకునేది

దిశ, సినిమా : హీరోయిన్ మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి.. అమ్మాయిలు క్లోజ్‌గా మూవ్ అయితే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్న అబ్బాయిలకు అక్కడి నుంచి మూవ్ అయిపోయి ఇంట్రెస్ట్ లేదన్న విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పొచ్చని సూచించింది. ఒక పర్సన్‌ అడ్వాన్స్‌గా ఫీల్ అయితే పర్సనల్‌గా మనం తీసుకునే డెసిషన్‌ పైనే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అమ్మాయి వర్క్ ప్లేస్‌లో చాలా మంది మగాళ్ల […]

Update: 2021-10-08 06:07 GMT

దిశ, సినిమా : హీరోయిన్ మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి.. అమ్మాయిలు క్లోజ్‌గా మూవ్ అయితే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్న అబ్బాయిలకు అక్కడి నుంచి మూవ్ అయిపోయి ఇంట్రెస్ట్ లేదన్న విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పొచ్చని సూచించింది. ఒక పర్సన్‌ అడ్వాన్స్‌గా ఫీల్ అయితే పర్సనల్‌గా మనం తీసుకునే డెసిషన్‌ పైనే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అమ్మాయి వర్క్ ప్లేస్‌లో చాలా మంది మగాళ్ల మధ్య ఉండాల్సి వస్తుందని, అలాంటప్పుడు మన వర్క్ ఏంటో మనం చూసుకుంటే సరిపోతుందని వివరించిన శర్మ.. కొందరు మనపై స్పెషల్ ఇంట్రెస్ట్‌తో ఉంటే, ఇన్‌ఫ్లుయన్స్ చేయాలని ట్రై చేస్తే ప్రభావితం కావడం, కాకపోవడం మన చాయిస్‌పైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలని తెలిపింది. ఒకరి ప్రజెన్స్‌ లేదా మీటింగ్‌‌లో అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయితే వెంటనే వెళ్లిపోవడం తప్పేమీ కాదని, వెళ్తున్నా మనని ఎవరు ఆపరు కదా అని చెబుతోంది మదాలస.

Tags:    

Similar News