ఎల్ఆర్ఎస్‌కు 19.33లక్షలు దరఖాస్తులు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అక్టోబర్‌ 31వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుది గడువు ఈనెల 15 వతేదీతో ముగిసినా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయలేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు తెగిపోవడంతో ప్రభుత్వం గుర్తించి ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు చేరగా చివరి రోజైన అక్టోబర్ 15తేదీన 2.58 లక్షల దరఖాస్తులు […]

Update: 2020-10-15 12:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అక్టోబర్‌ 31వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుది గడువు ఈనెల 15 వతేదీతో ముగిసినా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయలేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు తెగిపోవడంతో ప్రభుత్వం గుర్తించి ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు చేరగా చివరి రోజైన అక్టోబర్ 15తేదీన 2.58 లక్షల దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు.

Tags:    

Similar News