పురోగమన క్రాంతి.. చైతన్య స్రవంతి.. ‘దిశ’

సమస్తరంగాల ఫలాలు

Update: 2024-03-07 05:46 GMT

సమస్తరంగాల ఫలాలు

సగటు ప్రజల చెంతకు చేరాలని

అనునిత్యం తపిస్తూ

విలువైన పరిశోధనాత్మక కథనాలతో

అధికార పక్ష పాలనా విధానాలకు

లోతైన విమర్శకురాలిగా వ్యవహరిస్తూ...

కీలకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న

సామాన్యుల గొంతుక... "దిశ"...

కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే

పత్రికా రంగ గమనాన్ని

నిర్దేశించే స్థాయికి ఎదిగి

తనదైన అస్తిత్వాన్ని నిరూపించుకుని

తెలుగు ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు

ప్రతిరూపంగా తనను

తాను తీర్చిదిద్దుకుంటూ

తనదైన గమ్యం వైపు సాగుతున్న

పురోగమన క్రాంతి "దిశ"...

భిన్నత్వానికి ప్రతీకగా

అనునిత్యం ఎప్పటికప్పుడు

తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న మార్పులు

క్షణక్షణం ప్రజల చెంతకు చేరుస్తూ

వాస్తవ పరిస్థితులకు దర్పణంగా

ప్రకాశిస్తున్న నిఖార్సైన పత్రిక.."దిశ"

మారుతున్న పరిస్థితులను వేగంగా

ఆకళింపు చేసుకుంటూ

ప్రజలకు అందాల్సిన ఫలాలను

ఎటువంటి అరమరికలు లేకుండా

చిట్టచివరి వ్యక్తికి కూడా అందే విధంగా

తనదైన అక్షర కవన శక్తితో కదన రంగంలో

అసమాన పోరాటం చేస్తున్న

నిరంతరం చైతన్య స్రవంతి..."దిశ"

అట్లూరి.వెంకటరమణ

9550776152

Similar News