కవిమాట: రాజ్యాంగమును కాపాడ ఎవరి తరము??

poet word

Update: 2022-11-27 18:30 GMT

ప్రజలను ప్రభువులజేయ రాజ్యాంగమునుదెచ్చి

ఏలుకొమ్మనిజెప్పె అంబేద్కరుడు..!

రాజ్యాంగ ఫలములంది బాగుపడ

పెత్తనంబునెట్ల సాగునోనని కక్షబూని..

ప్రజలను బానిసజేయ ఉచితాలు విదిలించె పాలకుడు..!!

ఓటుతో నీరాత మార్చుకోమనిజెప్పి

సామాన్యుని చేత ఆయుధంబునిచ్చే అంబేద్కరుడు..!

నోటుతో ఓటును కొనుక్కొని గద్దె దిగకుండ

సామాన్యుని కట్టు బానిసనుజేయసాగె పాలకుడు..!!

రాజ్యాంగబద్ధంగ హక్కులను కల్పించి

స్వేచ్చగా జీవించ సామాన్యుని దీవించె అంబేద్కరుడు..!


పెత్తనంబు చేతబూని రాజ్యాంగమును మార్చ

సామాన్యుని హక్కులను కాలరాస్తుండె పాలకుడు..!!

ప్రజలను ప్రభువులుజేయ సంకల్పించి

ప్రజాస్వామ్యానికి నాంధి పలికే అంబేద్కరుడు..!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాంతీయ పార్టీల పేరుతో

తరతరాల రాచరిక పాలన కొనసాగిస్తుండె పాలకుడు..!!

తమ హక్కు తామెరగక.. ఉచితాల మత్తులో

బానిసైన నిస్చైతన్య ప్రజల రాతను మార్చగ

ఎందరు అంబేద్కరులు వచ్చినన్ ఏమి ఫలము..??

పాలకుల చేతిలో బందీ అయిన రాజ్యాంగమును కాపాడ ఎవరి తరము??

శ్రీనివాస్ గుండోజు,

పాత్రికేయులు, రచయిత,

99851 88429

Tags:    

Similar News