కవిత్వం మాత్రమే

Poem

Update: 2024-03-24 18:30 GMT

మట్టికి కవిత్వానికి

గొప్ప మహత్యం ఉంది

ఒక మొక్కను నాటు

ఒక విత్తనం పెట్టు

పచ్చపచ్చని జీవం పుట్టుక కేంద్రం

గొడవలెత్తి సంభ్రమాశ్చర్యం గొలుపుతుంది

గిరగిరా మిషన్‌తో

బోరువేసి గుండెల్ని నులిపెట్టినా

కోపతాపం లేక తల్లిలా

నీ దాహం తీరుస్తుంది

ఇంత ఎర్రటి మాడిపోయే

నడి ఎండల్లో కూడా

మరులుగొలిపే మల్లెపూల

సువాసనలను వెదజల్లుతుంది

నిన్ను సూర్యచంద్రులు

కిరణం హస్తాలతో

వెన్నెల విసన కర్రతో

పలకరించి పోతారు

నీకోసం పుండు పుండు

నేల అవుతుంది

నీ కోసం మేఘం వర్షిస్తుంది

నీకోసం మది నిండా

ది ప్రవహిస్తుంది

సమస్తాన్ని అనుభవించి

సహచరిని ఇంట్లో ఏం పని

చేస్తున్నవ్ అన్నట్టు, ఏదో పడగొట్టినట్టు

ఎన్నో గుట్టలను మలుపుకవచ్చినట్టు

సరసరా మరిచి నడచి పోతావు

నిర్మించడం కన్నా ధ్వంసం చేసింది ఎక్కువ

కవిత్వం అంటే

తనువంతా ప్రశ్నను చేసి

గురిపెట్టి సంధించిన బాణం మనిషి

కవిత్వం అంటే నేల నీరు ఆకాశం

ఒక జామ చెట్టు పైన వాలి

దోర పండును కొడుతున్న

ఎర్రముక్కు రామచిలక

-జూకంటి జగన్నాథం

94410 78095

Tags:    

Similar News