విశ్వగీతి

poem

Update: 2024-03-11 06:45 GMT

రాలిపడ్డ ప్రతి ఆకులోనూ

కరిగిన కొంత పత్రహరితం

నడిచివచ్చిన ప్రతిదానిలోనూ

కోల్పోయిన కొంత జీవితం!!

మిగిలింది అనుభవసారమే

అదే కదా నేను కూడబెట్టుకున్న

అపార సంపద

పురాతన మిత్రుడా

ఒక్కసారి కరచాలనం చేస్తూ

ఆలింగనం చేసుకో

నేను పాడుతున్న విశ్వగీతికి

గొంతు కలుపు

అదే నన్నూ నిన్నూ

మనిషిగా నిలబెడుతుంది

కొరుప్రోలు హరనాథ్

97035 42598

Tags:    

Similar News