కోడలు వేరు కాపురం ఎందుకు పెడుతుంది? నెట్టింట హాట్ హాట్ డిస్కషన్.. ఇంతకీ ఏం తేల్చారంటే..

కొత్తగా పెళ్లి అయిన నవ వధువు అత్తామామలతో ఆప్యాయంగా ఉంటుంది. కానీ తర్వాత పరిస్థితులు మారుతాయి. చిన్న చిన్నగా స్టార్ట్ అయిన గొడవలు పెద్దవి

Update: 2024-05-04 08:38 GMT

దిశ, ఫీచర్స్: కొత్తగా పెళ్లి అయిన నవ వధువు అత్తామామలతో ఆప్యాయంగా ఉంటుంది. కానీ తర్వాత పరిస్థితులు మారుతాయి. చిన్న చిన్నగా స్టార్ట్ అయిన గొడవలు పెద్దవి అయిపోతాయి. ఇక అప్పుడు అత్తాకోడళ్ల అసలు రంగు బయటపడుతుంది. ఒకరిని మించి మరొకరు చాడీలు చెప్పడం మొదలుపెడతారు. దీంతో ఒకే ఇంట్లో అమరలేని కోడలు భర్త దగ్గర వేరు కాపురం పెట్టించే ప్రయత్నం మొదలు పెడుతుంది. హస్బెండ్ కనిపిస్తే చాలు అదే మ్యాటర్ చెప్తూ మొత్తానికి కాస్త లేట్ అయినా ఒప్పిస్తుంది. కానీ అసలు ఇందుకు గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్ గా మారగా.. ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం.

ఈ మధ్య ఉమ్మడి కుటుంబాలు అసలు కనిపించడం లేదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి భర్తతో కలిసి సిటీకి వచ్చేస్తున్నారు. వాళ్లు ఇద్దరే ఉంటున్నారు. ఒకవేళ దంపతులతోపాటు అత్తామామ వస్తే మాత్రం కొంప కొల్లేరు అవుతుంది. వారు చెప్పినట్లే ఇంట్లో నడుచుకోవడం, వర్క్ స్ట్రెస్ ఉన్నా చెప్పి వెళ్లాలి చెప్పులేసుకు వెళ్లాలి అన్నట్లు ఉండాల్సి వస్తుంది. దీంతో చాలా మంది అమ్మాయిలు ఆఫీస్ లోని వాష్ రూమ్స్ లో ఈ ఒత్తిడిని తోటి ఉద్యోగులతో షేర్ చేసుకుంటూ ఏడుస్తున్నారట. కనీసం ఇల్లు కూడా తనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకునే ఛాన్స్ లేదని బాధపడుతున్నారట. భర్తతో బయటకు వెళ్దామన్న, కనీసం ప్రైవసీగా మాట్లాడదామన్న అవకాశం లేదని ఫీల్ అవుతున్నారట. మొత్తానికి ఈ కారణాలే కోడలు వేరు కాపురం పెట్టేందుకు దారితీస్తున్నాయని మేజర్ నెటిజన్ల అభిప్రాయం.

Similar News