వయసొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయకపోతే ఏం జరుగతది...?

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఓ ప్రయోజకులను...Special Story

Update: 2023-02-02 04:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఓ ప్రయోజకులను చేయాలనుకుంటారు. అదేవిధంగా వయసొచ్చినంక వారికి వివాహం చేయడం కోసం పరితపిస్తుంటారు. ఎందుకంటే.. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తుంటారు. అయితే, మగపిల్లల కంటే ఆడపిల్లలపైనా తల్లిదండ్రులు ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. చిన్నప్పటి నుంచి వారికి విద్యాబద్ధులు నేర్పించి ఆ తర్వాత ఓ వ్యక్తిని చూసి పెళ్లి చేస్తుంటారు. ఆ తర్వాత కూడా తమ కూతురి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అయితే, పలువురు తల్లిదండ్రులు తమ వయసొచ్చిన పిల్లల కోసం అంతగా పట్టించుకోరు.

అలా పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో అనేదానిపై ప్రముఖులు ఏం చెబుతున్నారంటే... అలా చేయడం సరికాదు అంటున్నారు. వయసొచ్చిన పిల్లలకు పెళ్లి చేయాలి. ఎందుకంటే.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని చెబుతుంటారు.. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ముందు చూపుతో ఉండాలని చెబుతున్నారు. వారికి చదువు చెప్పించి చక్కగా పెంచడమే కాదు... వారికి ఓ బాధ్యతగల్ల వరుడిని చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే... వయసొచ్చిన కొడుకు తనకు పెళ్లి చేయమని చెప్పొచ్చు.. చెప్పకపోవొచ్చు. లేదా అతని ప్రవర్తనలో మార్పులను బట్టి అర్థం చేసుకుని అతనికి ఓ వధువును చూసి పెళ్లి చేస్తుంటారు. అయితే, ఆడపిల్లల విషయంలో కూడా పలువురు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించరు. అసలు పట్టించుకోరు. అలా చేయడం సరికాదు... ఎందుకంటే కొడుకుల మాదిరిగా ఏ ఆడపిల్ల తనకు పెళ్లి చేయమని చెప్పదు.. కానీ, ఆమెను చక్కగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. ఆమెకు యుక్తవయస్సు వచ్చాక పెళ్లి కూడా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందంటున్నారు. ఆ పరిస్థులను తల్లిదండ్రులే అర్థం చేసుకోవాలి.. ఎందుకంటే ఆడపిల్లల మనసు సున్నితంగా ఉంటుందని చెబుతున్నారు. 

Read More: కోతి పిల్లను సాదుకుంటున్న పిల్లి..! (వీడియో)

Similar News