కోతి పిల్లను సాదుకుంటున్న పిల్లి..! (వీడియో)

by Disha Web Desk 12 |
కోతి పిల్లను సాదుకుంటున్న పిల్లి..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జంతు ప్రపంచంలో కుక్క, పిల్లి మంచి స్నేహితులు కావడం మనం చాలానే చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఓ పిల్లి కోతి పిల్లను సాదుకొవడం ఎప్పుడైనా చూశారా..? కానీ ఇప్పుడు ఒ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రోడ్డుపై బైక్ మీద వెలుతున్న ఓ వ్యక్తికి కొతి పిల్లను సాదుకుంటున్న పిల్లి కనిపించింది. దీంతో వెంటనే అతను తన ఫోన్ తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో కొతి పిల్లి మధ్య అదే రకమైన బంధాన్ని చూపిస్తుంది. కోతి పిల్ల పిల్లి పొట్ట భాగంలో పట్టుకుని వేలాడుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు తమ కామెంట్లతో వాటి బంధాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఓ నెటిజన్ ఆ వీడియే పై .. మొత్తం విశ్వంలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన బంధం అని రాసుకొచ్చాడు. మరో వ్యక్తి.. ఇది తల్లికి పిల్లలకు ఉన్న సంబంధం అని రాసుకొచ్చాడు.



Next Story