మల్లె పువ్వుల్లో దాగున్న ఔషధ గుణాలు.. అందంతో పాటు ఆరోగ్యం కూడా

మల్లె పువ్వులు ఇష్టపడని మగువలు ఉండరు.

Update: 2024-04-28 03:07 GMT

దిశ, ఫీచర్స్: మల్లె పువ్వులు ఇష్టపడని మగువలు ఉండరు. ప్రతి ఒక్కరికి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం. సువాసనలు వెదజల్లే ఈ పువ్వులు జడలో పెట్టుకుని అందంగా ముస్తాబు అవుతారు మహిళలు. ఇక సమ్మర్ కూడా స్టార్ట్ కావడంతో మల్లెల సీజన్ వచ్చేసింది. ఇక ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తాయి. అయితే.. మల్లె పువ్వుల వల్ల అందమే కాదు ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయంట. అవి ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తాయట. అయితే అవేంటో తెలుసుకుందాం.

* మల్లెపువ్వులో ఉండే సుగంధ ద్రవ్యాలు మానసిక, శారీరక అనారోగ్యాలను దూరం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

* మన శరీరంలో ఉన్న హార్మోన్లను కూడా సమతుల్యం చేయగల సత్తా మల్లెపువ్వులకు ఉంటుందట. ఆసియా ఖండంలో ఎన్నో ప్రాంతాల్లో మల్లెనూనెను డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలకు సహజ నివారణగా వాడుతుంటారు.

* అంతే కాకుండా మల్లె పూలు కారణంగా జుట్టుకు సమస్యలు కూడా దూరమవుతాయి. తెల్లగా ఉండే మల్లెపువ్వు నూనెతో మన జుట్టు నల్లగా మారుతుంది. దాంతోపాటు కుదుళ్లను బలంగా చేసి జుట్టు ఆరోగ్యంగా పెరిగేల చేస్తుంది.

* ఇక మల్లెపువ్వులతో చేసే జాస్మిన్ టీ వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెంచుతుంది. జీర్ణ సమస్యలు తగ్గి బరువు తగ్గుతారు.

* చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి జాస్మిన్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చాలా వరకు ఉపశమనాన్ని కగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

* జాస్మిన్ ఆయిల్ నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ దూరం చేసి.. మనశ్శాంతిని అందిస్తుంది. మానసిక స్థితి, మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Similar News