మీ ఇంట్లో ఇవి ఉన్నాయా..? అయితే పాముల ముప్పు తప్పదు జాగ్రత్త!

పాములు అంటే భయపడని వాళ్లు ఎవరూ ఉండరు.

Update: 2024-05-10 15:23 GMT

దిశ, ఫీచర్స్: పాములు అంటే భయపడని వాళ్లు ఎవరూ ఉండరు. పామును చూశారంటేనే భయందోళనతో ఆగకుండా పరుగులు తీస్తారు. అలాంటిది కొంత మంది ఇంట్లోకి అదే పనిగా పాములు వస్తుంటాయి. అలా రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అయితే.. ఇంటి ప్రాంగణంలో చాలా మంది అందం, చల్లదనం కోసం అనేక రకాల మొక్కలు పెంచుతారు. వీటిలో కొన్ని మొక్కల నుంచి వచ్చే స్మెల్, అలాగే వాటి దగ్గర ఉండే చల్లదనం కారణంగా పాములు వస్తాయట. ఈ కారణం చేతనే మొక్కలు ఉన్న ప్రతి ఇంటికి పాములు ఎక్కువగా వెళతాయి. మరి ఏయే మొక్కలు ప్రమాదానికి కారణమో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారంగా పాములు ఎక్కువగా సురక్షితమైన స్థలాన్ని ఎంచుకుంటాయి. అలాగే ఆహారం, నీరు, చల్లదం ఉండే ప్లేస్‌లో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడయట. ఈ క్రమంలోనే అవి గుబురుగా ఉన్న మొక్కల వద్ద అలాగే.. కీటకాలు ఎక్కువగా ఉండే వాటి దగ్గర తమ నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. వీటిలో ముఖ్యంగా అరటి చెట్లు పెంచుతున్న వారికి పాములు ముప్పు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అరటి చెట్ల వద్ద తగినంత నీరు, చల్లదనం ఉంటాయి. కాబట్టి ఆ చల్లదనానికి పాములు వచ్చి చేరుకుంటాయి.

అలాగే కొన్ని ఇంటి పై కప్పుపై కొమ్మలు కమ్ముకుని ఉంటాయి. ఇది కూడా పాములు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. చమేలీ, మొగలి పొదలు, పారిజాతం వంటి మొక్కల నుంచి వచ్చే సువాసనకు కూడా పాములు ఇంటికి చేరుకునే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ పాములు ఇంటికి రాకుండా ఉండాలంటే.. సర్పగంధ చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకుంటే మంచిదట. వీటికి పాములు దూరంగా ఉంటాయని కొందరు చెబుతుంటారు. అలాగే మరింత ముఖ్యంగా పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా అయితే.. ఎలాంటి కీటకాలు వచ్చే అవకాశం ఉండదు.

నోట్: పైన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చింది. ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News