Post Office Saving Schemes 2023 :రూ.95 కడితే 14 లక్షలు రిటన్​

పోస్టాఫీస్​లో అదిరిపోయే స్కీం వచ్చింది.

Update: 2023-06-11 07:50 GMT

దిశ, వెబ్​డెస్క్​ : పోస్టాఫీస్​లో అదిరిపోయే స్కీం వచ్చింది. ప్రతి రోజూ 95 రూపాయలు కడితే సుమారు 14 లక్షల రూపాయలు వచ్చే స్కీం ఉందని మీకు తెలుసా....ఆర్థిక ఇబ్బందులు, మధ్య తరగతి కుటుంబాలకు ఆపదలో ఆదుకునే అద్భుతమైన పథకం ఇది...మరో విషయం ఏమిటంటే ఇది మనీ బ్యాక్​ ఫాలసీ....ఎలాంటి రిస్క్​లేని సెంట్రల్​ గవర్నమెంట్​ పథకం...15 సంవత్సరాల గడువులో మూడు సార్లు డబ్బులు వడ్డీతో కలిపి తీసుకోవచ్చు. కాలం ముగిసిన తరువాత మరో సారి మిగిలిన పైకం వడ్డీతో వస్తుంది. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రవేశపెట్టిన పథకం. అదే పోస్టాఫీస్​ గ్రామీణ సుమంగళ్​ స్కీం.

ఎవరు అర్హులంటే...

ఈ స్కీంలో చేరాలంటే తప్పనిసరిగా గ్రామంలో నివసించే వారై ఉండాలి. లేదా ఏదైనా సిటీలో నివసిస్తున్నా ఊరి పేరుతో ఆధార్​ కార్డు కానీ, ఓటర్​ కార్డు కానీ కలిగి ఉండాలి. అలాంటి వారు కూడా అర్హులే. 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 19 సంవత్సరాలు నిండి ఉండాలి. హయ్యర్​ ఎడ్యుకేషన్​, బిజినెస్​ కోసం ఇది ఎంతో ఉత్తమమైన స్కీం. 

ఎన్ని సంవత్సరాలు డబ్బులు చెల్లించాలంటే...

ఈ స్కీం కాలపరిమితి 15 సంవత్సరాలు. 20 ఏళ్లు కూడా ఉంది. 15 సంవత్సరాల కాలపరిమితిని ప్రధానంగా సూచిస్తున్నారు. ప్రతి ఏడాది సుమారుగా 34,200 చొప్పున 15 సంవత్సరాలకు సుమారుగా రూ.6 లక్షల 85 వేలు చెల్లించాలి. కాలపరిమితి ముగిసిన తరువాత రూ. 14 లక్షలు చెల్లిస్తారు. మనీ బ్యాక్​ కింద 6,9,12 సంవత్సరాల్లో ఉన్న డబ్బుల్లో 25 శాతం చొప్పున వెనక్కి తీసుకోవచ్చు.

     మిగతా డబ్బులు 15వ సంవత్సరం వడ్డీతో కలిపి చెల్లిస్తారు. పైగా కుటుంబంలో ఒకరిని నామినీగా కూడా నమోదు చేసుకోవచ్చు. సెంట్రల్​ గవర్నమెంట్​ స్కీం కావడంతో డబ్బులకు ఎలాంటి భయం లేదు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి. 

Tags:    

Similar News