మీ కుడి చేతి వేళ్లు ఇలా ఉంటే కచ్చితంగా బట్టతల వస్తుందట..!

ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో తినే ఆహార పదార్థాల వల్ల చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం..

Update: 2023-03-26 07:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో తినే ఆహార పదార్థాల వల్ల చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. చిన్న వయస్సులోనే తలపై జుట్టును కోల్పోవడంతో పురుషులకు బట్టతల వస్తుంది. కొంత మందికి వర్క్ టెన్షన్, కాలుష్యం వల్ల కూడా జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే బట్టతల సమస్య ఎందుకు వస్తుందని ఇటీవల తైవాన్‌లో కాహ్‌సియుంగ్ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందట. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 37 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న 240 మంది పురుషుల చేతి వేళ్ళను విశ్లేషించారు. కుడి చేతి చూపుడు వేలుకంటే ఉంగరపు వేలు సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల బట్టతల వచ్చే ముప్పు ఉందని పరిశోధకుడు డాక్టర్ చింగ్ యింగ్ వెల్లడించారు. అలాగే కొంత మందిలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు కూడా జుట్టు రాలడం జరుగుతుందట. అలాగే స్త్రీలకు కూడా కుడిచేతి రెండవ వేలు పెద్దగా ఉంటే జుట్టు సమస్యలు వస్తాయట.

Read more:

స్త్రీలు పురుషులుగా.. పురుషులు స్త్రీలుగా ఎప్పుడవుతారో తెలుసా ? 

Tags:    

Similar News