Health tips: పరివృత్త త్రికోణాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

మొదటగా బల్లపరుపు నేలపై నిటారుగా నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత కాళ్ల మధ్య రెండు ఫీట్ల దూరం జరిపి పాదాలను ఎడమవైపు తిప్పాలి. ఇప్పుడు శరీరాన్ని కూడా పూర్తిగా ఎడమవైపు

Update: 2022-09-27 06:48 GMT

దిశ, ఫీచర్స్ : మొదటగా బల్లపరుపు నేలపై నిటారుగా నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత కాళ్ల మధ్య రెండు ఫీట్ల దూరం జరిపి పాదాలను ఎడమవైపు తిప్పాలి. ఇప్పుడు శరీరాన్ని కూడా పూర్తిగా ఎడమవైపు తిప్పి కాస్త కిందకు నడుము ఎత్తులో వంచాలి. ఇప్పుడు కుడి అరచేతిని ఎడమపాదం పక్కన నేలపై ఆన్చాలి. ఎడమ చేతిని ఆకాశంవైపు చూపిస్తూ సాగదీయాలి. ఈ భంగిమలో మోకాళ్లు, చేతులు, నడుము నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి మళ్లీ కుడివైపు వంగి చేయాలి.

ప్రయోజనాలు:

* అవయవాల పనితీరులో స్థిరత్వాన్ని పెంచుతుంది.

* కోర్ కండరాలను సక్రియం చేస్తుంది.

* వెన్నెముకను సాగదీసి బలాన్నిస్తుంది.

* మనస్సును ఉత్తేజపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ రోజు ప్రత్యేకత: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం 

Tags:    

Similar News