యువతలో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు..?

ఈరోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండానే ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో మృత్యువాత పడుతున్నారు.

Update: 2024-05-06 08:52 GMT

దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండానే ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. వాటిలో ముఖ్యమైనది హాట్ స్ట్రోక్, క్యాన్సర్. వీటికి వృద్ధులు మాత్రమే కాకుండా యూత్ కూడా బలవుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇక ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సరైన నిద్ర వంటివి లేకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది యవతలో క్యాన్సర్ వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా తాజా అధ్యయనాల ప్రకారం.. గతంలో వృద్ధులకు మాత్రమే వచ్చే పెద్ద ప్రేగు, మూత్రపిండాలు, కడుపు, పిత్తాశయం, ప్యాంక్రియాస్ వంటి క్యాన్సర్లు ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో కూడా వేగంగా పెరిగుతున్నట్లు తేలింది. అయితే.. ఈ క్యాన్సర్ ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు క్యాన్సర్ కారణంగా పురుషుల్లో మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని తేల్చేశారు నిపుణులు. ఇక మహిళల విషయానికి వస్తే.. రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగ్ క్యాన్సర్ వారిని ఎక్కువగా ఎటాక్ చేస్తుంటాయని చెబుతున్నారు.

Similar News