ఏక పాద దండ బ్రహ్మచర్యాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

మొదటగా బల్లపరుపు నేలపై పిరుదులు ఆన్చకుండా పాదాలపై కూర్చోవాలి. తర్వాత రెండు అరచేతులను ముందువైపు నేలపై ఆన్చాలి.

Update: 2022-10-03 06:50 GMT


ఏక పాద దండ బ్రహ్మచర్యాసనం :

మొదటగా బల్లపరుపు నేలపై పిరుదులు ఆన్చకుండా పాదాలపై కూర్చోవాలి. తర్వాత రెండు అరచేతులను ముందువైపు నేలపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతుల మధ్యనుంచి ఎడమకాలిని ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత కుడి అరికాలిని కుడి మోచేతిపై పెట్టి నెమ్మదిగా శరీరాన్ని గాల్లోకి లేపాలి. ఈ భంగిమలో శరీర బరువు మొత్తం రెండు చేతులపై ఉండేలా చూసుకోవాలి. ఎడమకాలు, వెన్నుముక నిటారుగా ఉండాలి. తల ముందుకు చూస్తుండాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగిన తర్వాత మళ్లీ కుడికాలు చాచి చేయాలి.

ప్రయోజనాలు :

* వెన్నెముక చలనశీలతను మెరుగుపరుస్తుంది.

* బొడ్డు చుట్టూ అదనపు కొవ్వును కరిగిస్తుంది.

* మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మెడ, వీపు కండరాలను టోన్ చేస్తుంది.

Similar News