10 రూపాయలకే పరాయి మగాడికి భార్యను అద్దెకు ఇస్తున్నారు.. ఎక్కడో కాదు మనదేశంలోనే!

సాధారణంగా మనం ఇల్లు, కార్లు, టెంట్ సామాన్లు అద్దెకు ఇవ్వడం చూస్తుంటాం కానీ భార్యను అద్దెకు ఇవ్వడం చూశారా..అసలు ఎప్పుడైనా ఈ మాట విన్నారా?..

Update: 2024-04-28 03:15 GMT

దిశ,ఫీచర్స్: సాధారణంగా మనం ఇల్లు, కార్లు, టెంట్ సామాన్లు అద్దెకు ఇవ్వడం చూస్తుంటాం కానీ భార్యను అద్దెకు ఇవ్వడం చూశారా..అసలు ఎప్పుడైనా ఈ మాట విన్నారా?..ఈ భాగోతం ఎక్కడో కాదు మన దేశంలోనే జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని శివపురిలో భార్యలను పరాయి మగాళ్ళకి అద్దెకు ఇస్తారు. ఇక్కడ 10 రూపాయల నుంచి వంద రూపాయలకి కూడా భార్యలను అద్దెకు ఇస్తారు. ఒక నెల లేదా ఒక ఏడాదికి ధనవంతులకి వధువు దొరక్కపోతే ఇలా అద్దెకు వేరొకరి భార్యలను తీసుకుంటారు. దీని కోసం ఒక సంత నిర్వహించి సంతలో పశువులను అమ్మినట్టు అమ్మాయిల్ని, ఆడవారిని అద్దెకు ఇస్తారు.

పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త.. తన భార్యను కాంట్రాక్ట్ మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు. ఈ క్రమంలో భార్య, పరాయి వ్యక్తి ఇద్దరు 10 రూపాయల నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ స్టాంప్ పేపర్ ని అద్దెకు ఇచ్చిన ఆవిడకు ఇవ్వడం వల్ల ఆమెను తిరిగి మళ్ళీ యజమాని అంటే భర్త కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇల్లాలి మీద ఓనర్ షిప్ అనేది మళ్ళీ ఎవరైతే ఎక్కువ డబ్బు చెల్లిస్తారో వారికి వెళ్ళిపోతుంది. లేదా అంతకు ముందు అద్దెకు తీసుకున్న వ్యక్తే ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేయించుకోవచ్చు. ఒప్పందంలో భాగంగా ఒక మహిళను అద్దెకు తీసుకున్నాక కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత కూడా ఆమెతోనే కొనసాగాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తులు కూడా కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిచ్చే వారున్నారు. పెళ్లైన అమ్మాయిలనే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకు ఇస్తారు. మైనర్ అమ్మాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు అక్కడ డిమాండ్ ఎక్కువ. పెళ్లైన వారి కంటే కూడా 8 నుంచి 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 15 వేల నుంచి 25 వేల మధ్య ఒప్పందం అనేది కుదుర్చుకుంటారు.

ఎంత వయసు తక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తారు కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయి కన్య అయ్యి అందంగా ఉంటే ఒక్కోసారి 2 లక్షలకు కూడా పోతుంది ఆమె ధర. ఒకవేళ కన్య కాని అమ్మాయి అయితే వారి స్కిన్ కలర్ బాగుండి, ఎంత తక్కువ మందితో గడిపారు అన్న అంశం మీద 10 వేల నుంచి 15 వేలు పలుకుతుంది. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకు వధువులు దొరికే పోవడం వంటి కారణాల వల్ల ఈ కల్చర్ అనేది కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే అక్కడ ఎవరు కూడా దీని మీద ఫిర్యాదు చేయలేదు. అక్కడ ఒక బిజినెస్ లా జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని అక్కడి వారికి ఉపాధి అవకాశాలు, విద్య ఆవశ్యకత వంటివి కల్పిస్తుందో లేదో చూడాలి.


Full View

Similar News