అక్కడ వికసించిన అందమైన ఓ పువ్వు.. ఆందోళనలో పరిశోధకులు.. ఎందుకంటే?

పువ్వు వికసించగానే చాలా ఆనందంగా.. దానిని చూస్తే హాయిగా అనిపిస్తుంది. కానీ ఉత్తరాఖండ్, హిమాలయాల చుట్టుపక్కల పూసే ఓ పువ్వు వికసించగానే శాస్త్ర వేత్తలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇంతకీ ఆ పువ్వు పేరు ఏమిటనుకుంటున్నారా?

Update: 2024-05-04 08:18 GMT

దిశ, ఫీచర్స్ : పువ్వు వికసించగానే చాలా ఆనందంగా.. దానిని చూస్తే హాయిగా అనిపిస్తుంది. కానీ ఉత్తరాఖండ్, హిమాలయాల చుట్టుపక్కల పూసే ఓ పువ్వు వికసించగానే శాస్త్ర వేత్తలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇంతకీ ఆ పువ్వు పేరు ఏమిటనుకుంటున్నారా?.. రోడోడెండ్రాన్. అందమైన పువ్వులో ఇది ఒకటి. ఎరుపు, లేత గులాభి రంగు కలగలిపి, చూడగానే కనులకు ఎంతో హాయినిచ్చే ఈ పువ్వు హిమాలయాల చుట్టుపక్కల ఎర్రటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. మాములుగా అయితే ఈ పూలు మార్చి, ఏప్రిల్ మధ్యలో వికసిస్తాయి. వీటిని చూడటానికి చుట్టుపక్కల వారు తరలి వస్తుంటారు. కానీ అలాంటి పూలు ఈ సారి డిసెంబర్, జనవరి నెలలోనే వికసించాయి. దీంతో పరిశోధకులు ఆందోళనకు గురి అవుతున్నారు. రోరోడెండ్రాన్ పూలు.. ఇంత త్వరగా వికసించాయంట గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉందని, ఇది ఇలానే కొనసాగితే మానవ మనగడకే ముప్పు వాటిల్లే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంటున్నారు వారు.

ఇక ఈపూలలో అనే ఔషధ విలువలు ఉన్నాయి. వీటిని చాలా మంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా ఇవి వేసవి కాలంలో పూస్తాయి. ఇవి పుష్పించడానికి 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. కానీ ఇవి శీతాకాలంలోనే వికసిచడం అనేది బలహీనపడుతున్న ప్రకతిని సూచిస్తుందని, మనిషి చేసే పనుల వలన గ్లోబల్ వార్మింగ్ సమస్య పెరిగిపోతుందని పర్యావరణ శాస్త్ర వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ సమస్య పెరిగిపకుండా ఉండటానికి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలని వారు తెలుపుతున్నారు.

Similar News