ఎక్కడ చూసినా విడాకుల ముచ్చటే.. కానీ ఈ విషయం మర్చిపోతున్నారా?

ప్రస్తుతం ఎవరి నోట విన్నా విడాకుల పేరే వినిపిస్తుంది. స్టార్ సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ చిన్న విషయాలకే డివోర్స్ అనడం కామన్ అయిపోయింది. అంతే కాకుండా సెలబ్రిటీస్ అయితే ఇన్ స్టాగ్రామ్ నుంచి

Update: 2024-05-01 08:02 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎవరి నోట విన్నా విడాకుల పేరే వినిపిస్తుంది. స్టార్ సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ చిన్న విషయాలకే డివోర్స్ అనడం కామన్ అయిపోయింది. అంతే కాకుండా సెలబ్రిటీస్ అయితే ఇన్ స్టాగ్రామ్ నుంచి తన ప్రియుడు, భర్త ఫొటోస్ డిలీట్ చేయడం.. రెండు మూడు రోజులకు మేము విడిపోయామని ప్రకటిస్తూ అభిమానులకు షాకిస్తున్నారు. ఇక కొంతమంది కామన్ పీపుల్ కూడా ఇదే బాటలో వెళ్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తెర మీదకు రాని ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే వారి వారి పర్సనల్ విషయాల వలన విడాకులు తీసుకోవడం ఓకే కానీ కొంత మంది తమ పిల్లల భవిష్యత్తును పట్టించుకోకుండా విడాకులు తీసుకుంటున్నారు. అసలు ఈ విడాకులు అనేది పిల్లల భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? దీని వలన వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో గుర్తించడంలో విఫలం అవుతున్నారు. కాగా, విడాకులు అనేది పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డివోర్స్ అనేది పిల్లల మెంటల్ హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా 6 నుండి 12 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుదంట. ఎందకంటే వారికి అప్పటికీ ఏం తెలియదు కానీ అప్పుడప్పుడే వారు సమాజం గురించి తెలుసుకోగలుగుతారు అలాంటి సమయంలో తల్లిదండ్రులు విడిపోతున్నారు అనే ఆలోచన వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తోందంట. ఇది వారి భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు.

తమ తల్లిదండ్రులు విడిపోతున్నారు అని తెలియడంతో వారు చాలా ఇబ్బందులకు గురి అవుతారు. ఏదో తెలియని భయం, బాధ వారిని వెంటాడుతుంది. అంతే కాకుండా తోటి పిల్లలతో వారు ఆడుకోలేరు. ఎప్పుడూ వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన.. నాన్న, అమ్మ లేకపోతే ఎలా అనే బాధ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందంట. అంతే కాకుండా వారు ఇంట్లో కూడా సంతోషంగా ఉండలేరు. మమ్మల్ని మా పేరెంట్స్ మధ్యలోనే వదిలేసి పోతారని వారితో సరిగ్గా ఉండలేరంట. అంతే కాకుండా విడాకులు పిల్లల చదువుపై ఎఫెక్ట్ చూపుతాయి. తల్లిదండ్రులు విడాకులు పిల్లల చదువుపై కూడా ప్రభావం చూపుతాయి. అలాగే క్లాసులో సరిగ్గా ఏకాగ్రత పెట్టలేరు. ఇది వారికి కష్టంగా ఉండవచ్చు. అసలు విషయానికొస్తే, వారికి చదువు పట్ల ఆసక్తి కొద్దికొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలలో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెబుతుంటే.. ఈ పిల్లల మనసుకు గాయంలా అనిపిస్తుంది. దీంతో వారి గోల్ మర్చిపోయి. వారి భవిష్యత్తు పాడయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందువలన ప్రతి తల్లిదండ్రులు ఎప్పుడూ విడాకుల గురించి తమ పిల్లల ముందు మాట్లాడుకోకూడదంట. అలాగే వారి ముందు ఎంత పోట్లాడుకుంటే అది తమ పిల్లల మెంటల్ హెల్త్ పై అంత ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు.

Read More : ప్రేమ లేకపోతే సూసైడ్.. పెళ్లైతే డివోర్స్.. ఏంటీ ఈ జనరేషన్ ప్రాబ్లమ్స్!


Similar News