గాలి కాలుష్యంతోనూ మధుమేహం.. 20% పెరుగుతున్నటైప్ -2 డయాబెటిస్ రిస్క్

కాలుష్యం ఆరోగ్యానికి హాని చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే గాలి కాలుష్యంవల్ల శ్వాసకోశ వ్యాధులు, నీటి కాలుష్యం వల్ల కలరా వంటివి వస్తాయనే చాలా మంది అనుకుంటారు. కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Update: 2024-04-29 10:55 GMT

దిశ, ఫీచర్స్ : కాలుష్యం ఆరోగ్యానికి హాని చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే గాలి కాలుష్యంవల్ల శ్వాసకోశ వ్యాధులు, నీటి కాలుష్యం వల్ల కలరా వంటివి వస్తాయనే చాలా మంది అనుకుంటారు. కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచుగా ఎయిర్ పొల్యూషన్ పరిసరాల్లో జీవించే వారు, మిగతా వారితో పోల్చితే టైప్ -2 డయాబెటిస్ బారిన పడే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉంటోందని ఈ అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కలుషిత గాలిలో పర్టిక్యులేట్స్ మేటర్ లెవెల్స్ 2.5 కు చేరడమే ఇందకు కారణంగా పేర్కొంటున్నారు.

మానవ వెంట్రకల పరిమాణం కన్నా 30 రెట్లు చిన్నగా ఉండే కలుషిత పదార్థాలను పర్టిక్యులేట్స్ మేటర్ (పీఎం)గా నిపుణులు పరిగణిస్తారు. పారిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ, ధూళి, విష వాయువులు, చెత్తా చెదారం వంటివి ఈ పీఎం 2.5 కలుషితాలకు నిలయంగా ఉంటున్నాయి. అధ్యయనంలో భాగంగా ఇవి మనుషులపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకునేందుకు పరిశోధకులు 268 మందిని కొంతకాలం అబ్జర్వ్ చేశారు.

గాలిలో 2.5 శాతంగా ఉండే పర్టిక్యులేట్స్ కలుషితాలను పీల్చడంవల్ల పలువురిలో నాడీ సంబంధిత సమస్యలతోపాటు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి, బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరగడానికి దారితీసినట్లు పరిశోధకులు తమ అధ్యయనం సందర్భంగా గుర్తించారు. సంవత్సరం పాటు 2.5 పీఎం పొల్యూషన్‌కు గురి కావడంవల్ల కొందరిలో టైప్-2 డయాబెటిస్ రిస్క్ 20 శాతం పెరిగినట్లు కనుగొన్నారు. కాబట్టి గాలి కాలుష్యాన్ని నివారించాలని, కలుషిత ప్రాంతాల్లో వర్క్ చేసేవారు మాస్కులు, ఎయిర్ ఫిల్టర్లు వంటివి యూజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News