చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. ఎక్కడ జరపుకుంటారో తెలుసా?

పుట్టిన వారు గిట్టక తప్పదు అనేది వాస్తవం. భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. ఇక ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఎంత పెద్ద పండుగ చేస్తారో చనిపోయిన తర్వాత కూడా అంతే పెద్దగా పండుగ చేస్తుంటారు. కానీ ఎక్కడైనా బతికి ఉన్నప్పుడే చచ్చిపోయాక

Update: 2024-05-15 09:33 GMT

దిశ, ఫీచర్స్ : పుట్టిన వారు గిట్టక తప్పదు అనేది వాస్తవం. భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. ఇక ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఎంత పెద్ద పండుగ చేస్తారో చనిపోయిన తర్వాత కూడా అంతే పెద్దగా పండుగ చేస్తుంటారు. కానీ ఎక్కడైనా బతికి ఉన్నప్పుడే చచ్చిపోయాక ఎలా ఉంటుందో చూస్తారా? అసలు అలాంటి ఫెస్టివల్స్ ఉంటాయా? అవును అని అనాల్సిందే. ఎందుకంటే? జపాన్‌లో మరణ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారంట. చాలా మంది ఈ ఫెస్టివల్ లో పాల్గొని చచ్చాక ఎలా ఉంటుందో తెలుసుకుంటారంట.

ఈ పండుగ సమయంలో శవానికి వేసే బట్టలను ధరించి శవపేటికలో పడుకుంటాడు. మరణం గురించిన వర్క్‌షాప్‌లలో కూడా పాల్గొంటారు. అయితే చాలా మంది మరణం అంటే భయానికి లోను అవుతుంటారు. కానీ అలాంటి భయాందోళనలు వదిలేసి, మరణానికి ఎలా సిద్ధం కావాలో నేర్పిస్తారంట. ఇంతకీ ఆ పండుగ పేరు ఏంటీ అనుకుంటున్నారా? శుకత్సు ఉత్సవం, ఇందులో ఒక వ్యక్తి చనిపోయాక ఏం జరుగుతుంది. అసలు చనిపోతే ఎలా ఉంటుందని తమకు చూపిస్తారు. అంతే కాకుండా కొంత మంది తాము చనిపోయాక తన బంధువులు ఎలా ఉంటారో, నేను లేను అనే పదాన్ని ఊహించుకోవడాకి కూడా భయపడుతారు. కానీ ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత వాటి నుంచి ఈజీగా బయటపడుతారు అంటున్నారు జపానీస్. ఇక ఈ పండుగను ప్రతి సంవత్సరం, డిసెంబర్ 16వ తేదీని జరుపుకుంటారు. దీని ప్రధాన లక్ష్యం మరణం తర్వాత ఎలా ఉంటుంది? వారు పోయిన తర్వాత మిగిలిపోయిన వ్యక్తులకు ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియజేయడం దీని ఉద్దేశం. సందర్శకులకు వివిధ వర్క్‌షాప్‌లు, ఇతర కార్యక్రమాలు అందిస్తారు.

Similar News