నా హయాంలో ఎవరికీ అన్యాయం జరగొద్దు: సీఎం యోగీ అదిత్యనాథ్

తన హయాంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని సీఎం యోగీ అదిత్యనాథ్ అధికారులను అదేశించారు. బుధవారం ఆయన ప్రజలతో నేరుగా ముచ్చటించే 'జనతా దర్శన్' కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2023-03-29 17:52 GMT

దిశ, వెబ్ డెస్క్: తన హయాంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని సీఎం యోగీ అదిత్యనాథ్ అధికారులను అదేశించారు. బుధవారం ఆయన ప్రజలతో నేరుగా ముచ్చటించే 'జనతా దర్శన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 700 మంది బాధితులు సీఎంతో నేరుగా తమ సమస్యలను విన్నవించారు. ఓ మహిళ తన ఇల్లును కొందరు ధ్వంసం చేశారని విన్నవించింది. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ ఏ మాత్రం ఆందోళన చెందకూడదని, తన హయాంలో పేదలు, బలహీనులను ఎవరూ నాశనం చేయలేదని ఆయన అన్నారు.

అక్రమంగా భూములు ఆక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలంటూ అధికారులకు సూచించారు. సదరు మహిళ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలంటూ అధికారులు, పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ముఖ్యమంత్రిని కలిసి వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని కోరారు. అదేవిధంగా కొందరు వికలాంగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారి ప్రాధాన్యతపై ఉన్నతాధికారులతో చర్చించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News