అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి : బూర నర్సయ్య గౌడ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం

Update: 2024-05-11 15:23 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని సాగర్ రహదారిపై భారీ ర్యాలీ, రోడ్ షో లో బీజేపీ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తాను గతంలో చేసిన సేవలను గుర్తు పెట్టుకుని తనకు ఓటు వేయాలని భువనగిరి పార్లమెంట్ ప్రాంతంలో గతంలో 9 వేల కోట్లతో అభివృద్ధి చేశానని, పలు మెడికల్ కాలేజీలు కూడా కట్టించడం జరిగిందన్నారు. తాను ప్రజలందరికీ తలలో నాలుకలా ఉండే వ్యక్తిని, పిలిస్తే పలుకుతానని ఆయన అన్నారు. తనకు ఈసారి అవకాశం ఇస్తే భువనగిరి పార్లమెంట్ ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాలను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని, కేంద్రంలో బిజీ ఎన్డీఏ సర్కారు వస్తుంది కాబట్టి తనకు ఓటు వేస్తే ప్రజలు అద్భుతంగా ప్రతిఫలం పొంది పనులు చేయించుకోవచ్చు అని ఆయన సూచించారు.

ప్రజలు మోసపూరితమైన కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా భారతదేశాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని, కేవలం మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశం గా తిరుగుతుంది అన్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు దండే శ్రీశైలం, తాండ్ర రవీందర్ మున్సిపల్ అధ్యక్షులు బూడిద నర్సింహారెడ్డి, కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ, ముత్యాల భాస్కర్, భాజపా జిల్లా కార్యదర్శి, ఫ్లోర్ లీడర్ పొట్టి రాములు, బిజెపి నాయకులు అంజయ్య యాదవ్, నోముల దయానంద్ గౌడ్, కొత్త అశోక్ గౌడ్, బొజిరెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి, నిట్టు శ్రీశైలం, గంగనమోని సతీష్, శేఖర్ రెడ్డి, ఆడెపు రాఘవేందర్, టేకుల రాంరెడ్డి ముత్యాల మహేందర్, జెర్రీ గల అశోక్, ముదిగొండ సాయి తేజ, మైలారం విజయకుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Similar News