బీజాపూర్ లో పేలిన మందుపాతర

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు మంగళవారం మందుపాతర పేల్చారు. బసగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెడగెల్లూరులోని గోల్కొండ కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులకు చెందిన రమేశ్ భండారి, రమేశ్ హేమ్లాలు గాయపడ్డారు. కాగా వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు […]

Update: 2020-10-20 07:41 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్:
ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు మంగళవారం మందుపాతర పేల్చారు. బసగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెడగెల్లూరులోని గోల్కొండ కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులకు చెందిన రమేశ్ భండారి, రమేశ్ హేమ్లాలు గాయపడ్డారు. కాగా వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన ఒకరు చనిపోయారు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News