కన్నుల పండుగగా కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు..(వీడియో)

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో ఏడు కొండలపై కొలువైన కురుమూర్తి స్వామి వారి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమాలు మంగళవారం శోభాయమానంగా సాగాయి. ఆత్మకూరు పట్టణంలో ఎస్‌బీఐ లాకర్లలో భద్రపరిచిన ఆభరణాలను దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా ఆ ఆభరణాలను దేవాలయం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల […]

Update: 2021-11-09 02:00 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో ఏడు కొండలపై కొలువైన కురుమూర్తి స్వామి వారి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమాలు మంగళవారం శోభాయమానంగా సాగాయి. ఆత్మకూరు పట్టణంలో ఎస్‌బీఐ లాకర్లలో భద్రపరిచిన ఆభరణాలను దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా ఆ ఆభరణాలను దేవాలయం వద్దకు తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉత్సాహంగా డోలు మ్రోగిస్తూ భక్తులతో కలిసి ముందుకు సాగారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా తీసుకువచ్చిన ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News