నీతో ఉండలేకపోతున్నందుకు.. సారీ! : కీర్తి

దిశ, వెబ్ డెస్క్: ఒక్కసారి పెట్‌తో అనుబంధం ఏర్పడితే అసలు వాటిని వదిలిపెట్టి ఉండలేం. ఒక్కరోజు దూరంగా ఉండాలన్నా చాలా బాధేస్తుంది. అవి కూడా అంతే.. వెంటనే డల్ అయిపోతాయి. ఈ విషయం పెట్ లవర్స్ అందరికీ తెలుసు. అదే పరిస్థితి తనకూ ఎదురైందని చెప్పింది కీర్తి సురేశ్. అది కూడా తన పెట్ డాగ్ ‘నైక్’ పుట్టినరోజున తనతో ఉండకపోవడంతో చాలా ఎమోషనల్ అవుతూ లాంగ్ నోట్ పెట్టింది. నైక్‌తో ఉన్న అనుబంధం గురించి చెప్తూనే.. […]

Update: 2020-09-03 00:58 GMT

దిశ, వెబ్ డెస్క్:
ఒక్కసారి పెట్‌తో అనుబంధం ఏర్పడితే అసలు వాటిని వదిలిపెట్టి ఉండలేం. ఒక్కరోజు దూరంగా ఉండాలన్నా చాలా బాధేస్తుంది. అవి కూడా అంతే.. వెంటనే డల్ అయిపోతాయి. ఈ విషయం పెట్ లవర్స్ అందరికీ తెలుసు. అదే పరిస్థితి తనకూ ఎదురైందని చెప్పింది కీర్తి సురేశ్. అది కూడా తన పెట్ డాగ్ ‘నైక్’ పుట్టినరోజున తనతో ఉండకపోవడంతో చాలా ఎమోషనల్ అవుతూ లాంగ్ నోట్ పెట్టింది. నైక్‌తో ఉన్న అనుబంధం గురించి చెప్తూనే.. అమ్మగా తనతో ఉండలేకపోతున్నందుకు బాధపడింది కీర్తి.

‘నైక్ నువ్వు మా కుటుంబంలోకి అడుగుపెట్టి రెండేళ్లయింది. నువ్వు నిజంగా మా లైఫ్‌కు గేమ్ చేంజర్. ఈ రోజు మాదిరిగానే ఇంతకు ముందు కూడా పని గురించి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. నువ్వు.. నాకు, మన కుటుంబానికి, నా స్నేహితులందరికీ కూడా చాలా ప్రత్యేకం. కుక్క పిల్లలను చూసి ఇంతకు ముందు భయపడేవారు కూడా నిన్ను చూశాక ఆ ఒపీనియన్ మార్చుకున్నారు. లాక్ డౌన్‌లో చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేసి కీర్తి నిన్ను మిస్ అవుతున్నాం.. నీ కన్నా నైక్‌ను కొంచెం ఎక్కువ మిస్ అవుతున్నాం.. అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు మాతో పాటు చాలా మందిని నీ ప్రేమతో దగ్గరికి చేశావ్.. నీ ఉనికి గుర్తించేలా చేశావ్.. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నేను చూడలేను.. ఆ సమయంలో హే మమ్మీ నేను బాగానే ఉన్నానని నువ్వు వచ్చి చెప్పే విధానం చాలా ఆనందాన్నిస్తుంది. సర్‌ప్రైజింగ్‌గా నా దగ్గరకు వచ్చిన నువ్వు.. ప్రతీరోజు సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నావ్.. లవ్ యూ అండ్ మిస్ యూ ఫ్రమ్ యువర్ మదర్’ అంటూ ముగించింది కీర్తి. ఇక కీర్తి ఫ్రెండ్ హీరోయిన్ మాళవికా మోహనన్ నైక్‌కు బర్త్ డే విషేస్ చెప్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

కాగా, సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకుంది కీర్తి. సర్కార్‌ వారి పాట కోసమే ఈ ప్రయాణమనేది ఫిల్మ్ నగర్ టాక్.

https://www.instagram.com/p/CEpB3gOpJ2D/?igshid=1aekeg6vi17yb

Tags:    

Similar News