సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు.. ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు?

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమిళనాడు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేసినప్పుడు యూనియన్ నాయకులతో కాకుండా కార్మికులతో మాట్లాడతానని చెప్పడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకు చెందిన నదీ జలాల విషయంలో ఏకపక్షంగా వెళ్లడం, నిర్ణయాలు తీసుకోవడం వలన కూడా అధికారానికి […]

Update: 2021-12-19 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమిళనాడు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేసినప్పుడు యూనియన్ నాయకులతో కాకుండా కార్మికులతో మాట్లాడతానని చెప్పడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకు చెందిన నదీ జలాల విషయంలో ఏకపక్షంగా వెళ్లడం, నిర్ణయాలు తీసుకోవడం వలన కూడా అధికారానికి దూరం కావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, జస్టిస్ చంద్రు జీవితచరిత్ర ఆధారంగానే ‘జై భీమ్’ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో తమిళ నటుడు సూర్య లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కేంద్రంపై పోరు.. కేసీఆర్, కేటీఆర్ దూరమెందుకు?

Tags:    

Similar News