సగానికిపైగా తగ్గిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఉత్పత్తి!

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కారణంగా ఏప్రిల్ నెలకు కంపెనీ ఉత్పత్తి 60 శాతం తగ్గిందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. 2019 ఏప్రిల్ నెలలో 13.90 లక్షల టన్నుల ఉత్పత్తి జరగ్గా..ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేవలం 5.63 లక్షల టన్నులకే పరిమితమైనట్టు వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభంలో సంస్థ ఉత్పత్తి సామర్థ్యంలో 38 శాతం మాత్రమే వినియోగించుకున్నట్లు తెలిపింది. ఉత్పత్తి పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి అవసరమైన అనుమతుల కోసం కావాల్సిన చర్యలు ప్రారంభమయ్యాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. […]

Update: 2020-05-04 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కారణంగా ఏప్రిల్ నెలకు కంపెనీ ఉత్పత్తి 60 శాతం తగ్గిందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. 2019 ఏప్రిల్ నెలలో 13.90 లక్షల టన్నుల ఉత్పత్తి జరగ్గా..ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేవలం 5.63 లక్షల టన్నులకే పరిమితమైనట్టు వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభంలో సంస్థ ఉత్పత్తి సామర్థ్యంలో 38 శాతం మాత్రమే వినియోగించుకున్నట్లు తెలిపింది. ఉత్పత్తి పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి అవసరమైన అనుమతుల కోసం కావాల్సిన చర్యలు ప్రారంభమయ్యాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తూ కొంతవరకూ ఉత్పత్తిని పెంచామని, క్రమంగా దీన్ని పెంచనున్నట్లు వెల్లడించారు.

లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన వెలువడిన మార్చి 25న మొదటిసారి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 40 రోజులకు పైగా రెండు దశల్లో లాక్‌డౌన్ కొనసాగిన అనంతరం సోమవారం నుంచి సడలింపుల మధ్య మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. సోమవారం నుంచి గతం కంటే అధికంగా ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయి. మినహాయింపులిస్తూ కొన్ని కంపెనీలకు అనుమతులివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై కొంత విశ్వాసం పెరిగిందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ భావిస్తోంది.

Tags: JSW Steel, steel production, raw materials, Metal Industry, JSW Group

Tags:    

Similar News