అదే లేకుంటే ఎప్పుడో ముందుకెళ్లేవాళ్లం : పవన్

దిశ, వెబ్‌డెస్క్: అంతర్వేది ఘటనకు సంబంధించి పలు రాజకీయ పార్టీలతో పాటు ధార్మిక సంస్థలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్నఏపీ ప్రభుత్వం సీబీఐకు కేటాయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 'పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదని.. మన ధర్మాన్ని పాటిస్తూనే ఇతర మతాల పట్ల సహనంతో ఉండటం' అని చెప్పారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ […]

Update: 2020-09-11 02:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్వేది ఘటనకు సంబంధించి పలు రాజకీయ పార్టీలతో పాటు ధార్మిక సంస్థలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్నఏపీ ప్రభుత్వం సీబీఐకు కేటాయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 'పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదని.. మన ధర్మాన్ని పాటిస్తూనే ఇతర మతాల పట్ల సహనంతో ఉండటం' అని చెప్పారు.

1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తుచేశారు. అదేవిధంగా మతతత్వం, మూఢ భక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేదని వివేకానంద అభిప్రాయ పడ్డారని కూడా తెలిపారు.

Read Also…

ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం

Tags:    

Similar News