IPL2024: అదరగొట్టిన తెలుగు ప్లేయర్.. SRH భారీ స్కోర్

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు విఫలమైనా.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన వారు సత్తా చాటారు.

Update: 2024-04-09 15:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు విఫలమైనా.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన వారు సత్తా చాటారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్న తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. SRH బ్యాటర్లలో నితీష్ రెడ్డి(64), అబ్దుల్ సమద్(25), ట్రావిడ్ హెడ్(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్హదీప్ సింగ్ 4, సామ్ కర్రాన్ 2, హర్షల్ పటేల్ 2, కాగిసో రబాడా ఒక వికెట్ తీశారు. పంజాబ్ విజయాన్ని చేరుకోవాలంటే 183 పరుగులు చేయాల్సి ఉంది.

Tags:    

Similar News