కేటీపీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం.. వారి నిర్లక్ష్యమేనా ?

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1.వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజీతో బుధవారం ఉదయం500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌లో పదేపదే విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడటం పరిపాటైపోయింది. పవర్ ప్రాజెక్ట్ ఒకటవ,  రెండవ దశలో ట్యూబ్ లీకేజ్ కావడంతో విద్యుత్ ఉత్పత్తికి  నెలకు రెండు మూడు సార్లు ఆటంకం ఏర్పడుతూనే ఉంది. ఈ అంతరాయాన్ని సరిచేయడానికి అధికారులు సరైన […]

Update: 2021-10-19 21:23 GMT

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1.వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజీతో బుధవారం ఉదయం500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌లో పదేపదే విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడటం పరిపాటైపోయింది. పవర్ ప్రాజెక్ట్ ఒకటవ, రెండవ దశలో ట్యూబ్ లీకేజ్ కావడంతో విద్యుత్ ఉత్పత్తికి నెలకు రెండు మూడు సార్లు ఆటంకం ఏర్పడుతూనే ఉంది.

ఈ అంతరాయాన్ని సరిచేయడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడంతో సంస్థకు నష్టం ఏర్పడటంతో పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయం పదేపదే ఏర్పడుతుంది. ఒకటవ ,రెండవ దశలో ట్యూబులు లీకు కావడంపై సంస్థ సమగ్ర విచారణ ఎందుకు జరపడం లేదని పలువురు అధికారులు అంటున్నారు. నాసిరకం పరికరాలు వాడుతున్నారా లేదా సిబ్బంది పనితీరు లోపమా? అనేదానిపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News