మేఘాలపై వింత గ్రామం.. అసలు వర్షమే కురవదు

    దిశ, వెబ్ డెస్క్: భూ ప్రపంచంలో వింతలు, విడ్డూరాలకు ఏ మాత్రం కొదవలేదు. మనిషి ఊహకు అందని విచిత్రాలు ఎన్నో బయటపడుతూనే ఉంటాయి. అలాంటి గ్రామం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో వర్షం కురవలేదట. అందుకే దీన్ని చూసేందుకు పర్యాటకులు క్యూకడుతూనే ఉంటారు. అక్కడి అందమైన లొకేషన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ వింత గ్రామం పేరు అల్-హుతైబ్.. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఇక్కడ ఇప్పటి […]

Update: 2021-07-03 04:48 GMT

 

Full View

 

దిశ, వెబ్ డెస్క్: భూ ప్రపంచంలో వింతలు, విడ్డూరాలకు ఏ మాత్రం కొదవలేదు. మనిషి ఊహకు అందని విచిత్రాలు ఎన్నో బయటపడుతూనే ఉంటాయి. అలాంటి గ్రామం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో వర్షం కురవలేదట. అందుకే దీన్ని చూసేందుకు పర్యాటకులు క్యూకడుతూనే ఉంటారు. అక్కడి అందమైన లొకేషన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ వింత గ్రామం పేరు అల్-హుతైబ్.. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు అసలు వర్షమే కురవలేదట. గ్రామం భూ ఉపరితలానికి 3వేల 200 మీటర్ల ఎత్తులో ఉండటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రామం మేఘాల కంటే ఎత్తులో ఉండటం వర్షాలు కురిసే అవకాశం లేదు. అయితే వారి కంటే దిగువ ఉన్న గ్రామాల్లో మేఘాలు ఏర్పడి వర్షం పడుతుంటే వారంతా ఆసక్తిగా చూస్తూ ఉంటారట.

ఇక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది. పగలు విపరీతమైన వేడిగా మారుతుంది. రాత్రి సమయంలో చలి వణికించేస్తుంది. అయితే దీనికి ఆ ప్రాంత వాసులు అలవాటుపడిపోయారు. పర్యాటకులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ గ్రామంలో పాత కాలపు నిర్మాణాలు అందరిని ఆకట్టుకుంటాయి. వీటితో పాటు అత్యాధునిక కొత్త నిర్మాణాలు కూడా దర్శనమిస్తాయి. మొత్తం మీద ఈ వింత ఆగ్రామంలో ఎత్తైన కొండపై నుంచి దిగువకు చూస్తూ పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు.

Tags:    

Similar News