Ap Politics:జనసేనాని రోడ్ షోకు అడ్డంకులు..కారణం ఏంటంటే?

ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో జనసేన అధినేత తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు.

Update: 2024-05-08 09:51 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ:ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో జనసేన అధినేత తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పిఠాపురంలో ఈ నెల 10న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న రోడ్‌షోకు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రోడ్ షోకు అనుమతుల కోసం టీడీపీ, జనసేన నేతలు స్థానిక ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. సర్వర్ పని చేయడం లేదని సిబ్బంది చెప్పడంతో అక్కడే వేచి ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు సర్వర్ పని చేస్తున్నారంటూ దరఖాస్తు తీసుకుని సిబ్బంది ఓటీపీ నెంబర్ ఇచ్చారు. అదే రోజు సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ రోడ్ షో కు అనుమతులు ఇస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ నిజంగానే మొరాయించిందా, కావాలనే ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారా అనేది సందేహాస్పదంగా మారింది. జగన్ సభ కోసం వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారా, లేదా అనేది తెలియడం లేదు.దీనిపై తెదేపా నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆర్వోతో మాట్లాడినట్లు చెప్పారు. ఎవరు ముందు దరఖాస్తు ఇస్తే వారికి అనుమతి వస్తుందని చెప్పారన్నారు. అధికారులు పక్షపాతం చూపించకుండా నిబద్ధతతో పని చేస్తే పవన్ కళ్యాణ్ రోడ్ షోకు అనుమతి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Read More...

పవన్ భార్యలకు ముద్రగడ బంఫర్ ఆఫర్.. వైరల్ అవుతున్న పెద్దాయన వ్యాఖ్యలు

Similar News