పెరుగుతున్న నిరుద్యోగిత రేటు!

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో ఇండియా ఓవైపు పోరాడుతుంటే ఇండియా నిరుద్యోగిత రేటు మాత్రం 9 శాతానికి పెరిగింది. ఇది గడిచిన 43 నెలల్లో అత్యధికమని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ) గణాంకాలను విడుదల చేసింది. ఇంతకుముందు నెలలో విడుదల చేసిన గణాంకాల్లో నిరుద్యోగిత రేటు 8.74 శాతం ఉండేదని సీఎమ్ఐఈ డేటా వెల్లడించింది. 2016 ఆగష్టులో నిరుద్యోగిత రేటు 9.59 శాతం తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం […]

Update: 2020-04-03 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో ఇండియా ఓవైపు పోరాడుతుంటే ఇండియా నిరుద్యోగిత రేటు మాత్రం 9 శాతానికి పెరిగింది. ఇది గడిచిన 43 నెలల్లో అత్యధికమని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ) గణాంకాలను విడుదల చేసింది. ఇంతకుముందు నెలలో విడుదల చేసిన గణాంకాల్లో నిరుద్యోగిత రేటు 8.74 శాతం ఉండేదని సీఎమ్ఐఈ డేటా వెల్లడించింది. 2016 ఆగష్టులో నిరుద్యోగిత రేటు 9.59 శాతం తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం గమనార్హం.

పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.35 శాతంగా నమోదైతే, గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు 8.45 శాతంగా ఉంది. 2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ నిరుద్యోగిత రేటు 8 శాతం కంటే తక్కువగా నమోదైంది. సీఎమ్ఐఈ నివేదిక ప్రకారం మార్చి నెలలో అత్యధికంగా 29.9 శాతం నిరుద్యోగిత రేటు త్రిపుర రాష్ట్రం నమోదు చేస్తే, కేవలం 1.2 శాతంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అత్యల్ప నిరుద్యోగిత రేటు నమోదు చేసింది.

ఉపాధి రేటు మార్చి నెలలో అత్యంత దారుణంగా 38.24 శాతానికి పడిపోయింది. ఉద్యోగం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న నిరుద్యోగులు 3.79 కోట్ల మంది ఉన్నారు. గతంలో 2016 అక్టోబర్‌లో 3.85 కోట్ల మంది ఉద్యోగం కోసం వెతికే వారి సంఖ్య తర్వాత ఇదే అత్యల్పం. ఈ ఏడాది మార్చి నాటికి ఇండియా శ్రామిక శక్తి 43.3 కోట్లుగా ఉంది.

Tags : COVID-19 Pandemic, COVID-19 In India, India Unemployment Rate, Unemployment Rate March, Centre For Monitoring Indian Economy

Tags:    

Similar News