వరద బీభత్సం.. రంగంలోకి ఆర్మీ

దిశ,కంటోన్మెంట్: వరద సహాయక చర్యల కోసం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో ఆర్మీ పాల్గొన్నట్లు రక్షణశాఖ పౌరసంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బండ్లగూడ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న పలు కుటుంబాలను ప్రత్యేక పడవల ద్వారా జవాన్ లు బుధవారం కాపాడారు. వరద వల్ల ఇండ్ల నుంచి బయటకు రాలేని వారిని సురక్షితంగా జవాన్లు బయటకు […]

Update: 2020-10-14 10:54 GMT

దిశ,కంటోన్మెంట్: వరద సహాయక చర్యల కోసం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో ఆర్మీ పాల్గొన్నట్లు రక్షణశాఖ పౌరసంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బండ్లగూడ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న పలు కుటుంబాలను ప్రత్యేక పడవల ద్వారా జవాన్ లు బుధవారం కాపాడారు. వరద వల్ల ఇండ్ల నుంచి బయటకు రాలేని వారిని సురక్షితంగా జవాన్లు బయటకు తీసుకు వచ్చారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, మందులను పంపిణీ చేశారు. కొంతమందిని మెడికల్ ట్రీట్ మెంట్ కోసం తరలించగా, మరికొంత మందికి ప్రాథమిక చికిత్సలను అందించారు.

Tags:    

Similar News