అవన్నీ పుకార్లు… లాక్‌డౌన్ లేదు: కలెక్టర్

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో లాక్‌డౌన్ అమలు చేయబోతున్నారంటూ వస్తున్నవన్నీ పుకార్లేనని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు గత మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన కలెక్టర్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కృష్ణా […]

Update: 2020-07-24 01:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో లాక్‌డౌన్ అమలు చేయబోతున్నారంటూ వస్తున్నవన్నీ పుకార్లేనని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు గత మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన కలెక్టర్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కృష్ణా జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags:    

Similar News