రెయిన్ అలర్ట్: ఆ రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

న్యూఢిల్లీ: రుతుపవనాలు బలపడుతున్న నేపథ్యంలో పలురాష్ట్రాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కొంకణ్, గోవా తీరాల్లో ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో పాటు మహారాష్ట్రలోని తీరప్రాంత జిల్లాలు, కర్ణాటకలోని దక్షిణ ప్రాంత జిల్లాలు, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ లల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. కర్ణాటకలోని తీరప్రాంత జిల్లాల్లో జూన్ 17వరకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసినట్టు ఐఎండీ బెంగళూరు యూనిట్ డైరెక్టర్ సీఎస్ పాటిల్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా జూన్ 13 నుంచి […]

Update: 2021-06-14 07:39 GMT

న్యూఢిల్లీ: రుతుపవనాలు బలపడుతున్న నేపథ్యంలో పలురాష్ట్రాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కొంకణ్, గోవా తీరాల్లో ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో పాటు మహారాష్ట్రలోని తీరప్రాంత జిల్లాలు, కర్ణాటకలోని దక్షిణ ప్రాంత జిల్లాలు, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ లల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. కర్ణాటకలోని తీరప్రాంత జిల్లాల్లో జూన్ 17వరకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసినట్టు ఐఎండీ బెంగళూరు యూనిట్ డైరెక్టర్ సీఎస్ పాటిల్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా జూన్ 13 నుంచి 17వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణ కన్నడ ప్రాంతాలు, శివమొగ్గ, చిక్ మగ్‌లూర్ లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్పారు.

Tags:    

Similar News