కరీంనగర్ MLC ఎన్నికల్లో హుజురాబాద్ సీన్ రిపీట్..

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ సీన్ రిపీట్ కాబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నందున పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు అనగా డిసెంబర్ 7వ […]

Update: 2021-12-06 06:48 GMT

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ సీన్ రిపీట్ కాబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నందున పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు అనగా డిసెంబర్ 7వ తేది సాయంత్రం 7 గంటల నుంచి డిసెంబర్ 10వ తేది పోలింగ్ ముగిసే వరకు ప్రచారం నిర్వహించకూడదని కలెక్టర్ తెలిపారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం– 1951 సెక్షన్ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు మీడియా కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేశారు. మ్యూజికల్ కచేరిలు, ఇతర వినోద కార్యక్రమాలు కూడా కనిపించరాదన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని లేక రెండు శిక్షలను కలిపి విధించే ఆస్కారం కూడా ఉందన్నారు.

Tags:    

Similar News