వరలక్ష్మి ఘటన బాధాకరం :సుచరిత

దిశ, వెబ్‎డెస్క్: విశాఖలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. వరలక్ష్మి ఘటన బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.క్షుద్రపూజలు అంశంపై వారంలోగా నివేదిక వస్తుందని.. సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. దిశ యాప్‎పై పోలీసులు ప్రతి స్కూలుకు వెళ్లి అవగాహన కల్పిస్తారని […]

Update: 2020-11-02 01:13 GMT

దిశ, వెబ్‎డెస్క్: విశాఖలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. వరలక్ష్మి ఘటన బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.క్షుద్రపూజలు అంశంపై వారంలోగా నివేదిక వస్తుందని.. సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. దిశ యాప్‎పై పోలీసులు ప్రతి స్కూలుకు వెళ్లి అవగాహన కల్పిస్తారని సుచరిత చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News