కూకట్‌పల్లి సీఐకి హిమాచల్ ప్రదేశ్ సీఎం అభినందనలు

లాక్‌డౌన్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లలిత్ కుమార్‌ అనే వ్యక్తి కూకట్‌పల్లిలో చిక్కుకుపోయి, తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. సమాచారం అందుకునక్న కూకట్‌పల్లి పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా బాధితుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో అందుకు కావాల్సిన రూ. 20 వేలను కూకట్‌పల్లి సీఐ లక్ష్మినారాయణ రెడ్డి చెల్లించారు. కాగా, సకాలంలో వైద్యం చేయించడంతో పాటు ఆస్పత్రి బిల్లును చెల్లించి మానవత్వాన్ని చాటుకున్న కూకట్‌పల్లి సీఐ లక్ష్మి నారాయణ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి […]

Update: 2020-04-23 12:10 GMT

లాక్‌డౌన్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లలిత్ కుమార్‌ అనే వ్యక్తి కూకట్‌పల్లిలో చిక్కుకుపోయి, తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. సమాచారం అందుకునక్న కూకట్‌పల్లి పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా

బాధితుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో అందుకు కావాల్సిన రూ. 20 వేలను కూకట్‌పల్లి సీఐ లక్ష్మినారాయణ రెడ్డి చెల్లించారు. కాగా, సకాలంలో వైద్యం చేయించడంతో పాటు ఆస్పత్రి బిల్లును చెల్లించి మానవత్వాన్ని చాటుకున్న కూకట్‌పల్లి సీఐ లక్ష్మి నారాయణ రెడ్డిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అభినందించారు. ‌


Tags: Kukatpally CI, Himachal Pradesh CM, DGP, Health emergency

Tags:    

Similar News