ఫార్మా కంపెనీల కాలుష్యంపై మధ్యంతర ఉత్తర్వులు

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఫార్మా కంపెనీల కాలుష్యంపై గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణ నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పరవాడ ఔషధ కంపెనీల నుంచి విషతుల్య రసాయనాలను సముద్ర తీరం, సమీపంలోని చెరువుల్లోకి […]

Update: 2020-09-24 10:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఫార్మా కంపెనీల కాలుష్యంపై గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణ నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పరవాడ ఔషధ కంపెనీల నుంచి విషతుల్య రసాయనాలను సముద్ర తీరం, సమీపంలోని చెరువుల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్నారన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అక్కడి వృక్షాలు, జంతుజాలానికి, మత్స్యకారుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Tags:    

Similar News